Swastika Mukherjee: నగ్న ఫోటోలతో బెదిరింపు మెయిల్స్.. పోర్న్ సైట్స్‌లో పెడతామంటూ!

Actress Swastika Mukherjee Alleged producer of harassment her morphed pics - Sakshi

ప్రముఖ బెంగాలీ నటి స్వస్తిక ముఖర్జీ  ప్రధానంగా బెంగాలీ, హిందీ సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా నటిస్తోంది. ముఖర్జీ బెంగాలీ టీవీ సిరీస్ దేవదాసితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత హేమంతర్ పాఖీ (2001)చిత్రంతో సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆమె మస్తాన్ (2004). ముంబై కటింగ్ (2008)సినిమాలతో బాలీవుడ్‌లో ప్రవేశించింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న శిబ్పూర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో స్వస్తిక ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఈ చిత్ర నిర్మాత సందీప్ సర్కార్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపు మెయిల్స్ పంపుతున్నారని వెల్లడించింది. అంతే కాకుండా తన ఫోటోలను పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారని.. అందులో నగ్న ఫోటోలు కూడా ఉన్నాయని తెలిపింది. తాజాగా ఈ విషయంపై స్వస్తిక గోల్ఫ్ గ్రీన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అన్ని ఆధారాలతో పాటు ఈస్టర్న్ ఇండియా మోషన్ పిక్చర్స్ అసోసియేషన్‌ను సంప్రదించనున్నట్లు నటి పేర్కొంది. అయితే శిబ్పూర్ సినిమా షూటింగ్ సమయంలో తాను నిర్మాత సందీప్ సర్కార్‌ను ఎప్పుడు కలవలేదని వెల్లడించింది. 

కాగా.. ఇండో అమెరికానా ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రానికి నిర్మాతల్లో అజంతా సింగ్ రాయ్‌తో పాటు సందీప్ సర్కార్ ఒకరు. ఈవివాదంపై దర్శకుడు అరిందం భట్టాచార్య మాట్లాడుతూ.. "ఈ విషయం గురించి విన్నాను. ఏ రంగంలోనైనా సృజనాత్మక విభేదాలు తప్పవు. ఈ విషయంలో అదే జరిగింది. నేను దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు.' అని అన్నారు. 

అయితే స్వస్తిక ఫిర్యాదు చేసేందుకు దర్శకుడు ప్రేరేపించాడని నిర్మాతల సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను దర్శకుడు తిప్పికొట్టారు. ఇదంతా అబద్ధం.. నేను ఎలాంటి నెగెటివ్ ప్రచారాన్ని నమ్మను. స్వస్తిక లాంటి నటిని ప్రోత్సహిస్తానని అరిందం భట్టాచార్య తెలిపారు. పరంబ్రత ఛటర్జీతో కలిసి నటించిన 'శిబ్పూర్' మే 5న థియేటర్లలో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top