విడాకులతో పాటు సినిమా ప్లాపులు ఇలా ఎన్నో నన్ను చుట్టుముట్టాయి: సమంత | Actress Samantha Comments On Hitting All-Time Low - Sakshi
Sakshi News home page

Samantha: విడాకులతో పాటు ఈ సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి: సమంత

Published Thu, Nov 9 2023 12:35 PM | Last Updated on Thu, Nov 9 2023 12:59 PM

Actress Samantha Comments On Her Personal Life - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరమై పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపె​ట్టింది. తన ట్రీట్‌మెంట్‌లో భాగంగా భూటాన్‌లో ఉన్న సమంత.. డాట్‌షో (హాట్ స్టోన్ బాత్) అనే ఆయుర్వేద చికిత్సను తీసుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవితంలో తాను ఎదుర్కొన్న  బాధల గురించి తెలిపింది. ఒకేసారి మూడు సమస్యలు తనని చుట్టుముట్టినట్లు సమంత చెప్పింది.

(ఇదీ చదవండి: బాలకృష్ణ VS తారక్‌.. పోటీగా దిగుతున్న బాలయ్య.. అప్పటి రిజల్ట్‌ రిపీట్‌ కానుందా?)

జీవితంలో తన విడాకులు, సినిమాలు వరుసగా ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు ఇలా అన్నీ ఒకేసారి తన జీవితంలో చుట్టుముట్టడంతో ఎంతో కుంగిపోయానని సమంత చెప్పింది. జీవితంలో ఎవరికైనా అన్నింటి కంటే ముఖ్యమైనది వివాహం.. 'అది నా లైఫ్‌లో ముగిసిపోయింది. మరోవైపు నా ఆరోగ్యం దెబ్బతింటుంటే.. నేను నటించిన సినిమాలు కూడా వరుసగా ప్లాప్‌ అయ్యాయి. అవి అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఈ సమస్యలన్నింటితో చాలా బాధపడ్డాను. సుమారు రెండు సంవత్సరాల నుంచి జీవితంలో ఎంతో కుంగిపోయాను. ఆ సమయంలో.. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని తిరిగి నిలదొక్కుకున్న  నటుల గురించి  చదివాను.

జీవితంలో వారకి ట్రోలింగ్ ఎదురైనప్పుడు ఎలా నిలబడ్డారో తెలుసుకున్నాను. అలా వాళ్ల గురించి తెలుసుకున్నప్పుడు నాకెంతో సహాయపడింది. ఆందోళనకు గురైన వారి గురించి చదివాను. మరియు వారి కథలు చదవడం నాకు సహాయపడింది. ప్రజలు అలా చేస్తే, నేను కూడా చేయగలనని తెలుసుకోవడం నాకు బలాన్ని ఇచ్చింది. వారు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలననే ధైర్యం వచ్చింది. అదే నాకు బలాన్నిచ్చింది.' అని తెలిపారు.

ఈ దేశంలో ఎందరో స్టార్స్‌ ఉండగా వారందరిలో తనకు కూడా గుర్తింపు రావడం ఎంతో గొప్ప అదృష్టమని సమంత తెలిపింది. ఒక నటిగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా ముఖ్యం. అది తనుకు అందిన గిఫ్ట్‌ ఆమె చెప్పుకొచ్చింది. ఒక నటిగా నా కర్తవ్యాన్ని నేను ఎంతో నిజాయితీగా నిర్వర్తిస్తున్నాను. ఈ గ్లామర్‌ ప్రపంచంలో నటీనటుల జీవితాల్లో సినిమా, అవార్డులు, వారు ధరించే దుస్తువులే మాత్రమే కాదు.. వారికి కూడా కష్టాలతో పాటు ఎన్నో బాధలు ఉంటాయి. కాబట్టి నా ఇబ్బందులు బహిర్గతం అయినందుకు నాలో ఎలాంటి బాధలేదు. ఇక్కడ నాలా ఇబ్బందులు పడే వారు ఎందరో ఉన్నారు.వారందరూ కూడా నాలాగే పోరాడాలని ఆశిస్తున్నాను.' అని సమంత పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: మహ్మద్‌ షమీకి ఆఫర్‌ ఇచ్చిన హీరోయిన్‌.. నీకు ఏం కావాలో చెప్పు అంటూ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement