హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

Rashmika: రష్మిక వీడియో.. డీప్‌ ఫేకర్‌ అరెస్ట్‌

Published Sat, Jan 20 2024 3:17 PM

Actress Rashmika Deepfake Creator Arrested In Delhi - Sakshi

సరిగ్గా ఓ రెండు నెలల క్రితం డీప్ ఫేక్ వీడియో సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. పాన్ ఇండియా హీరోయిన్ రష్మికకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

(ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ)

టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. అలానే ఈ మధ్య కాలంలో ఏఐ టెక్నాలజీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీని ద్వారా మంచి ఉన్నట్లే కొందరు చెడుగానూ ఉపయోగిస్తున్నారు. అలానే రష్మిక ముఖంతో ఓ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది తెగ వైరల్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో కత్రినా, అమితాబ్, ప్రియాంక చోప్రా, సచిన్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు.

బ్రిటీష్-ఇండియన్ ఇన్ఫ్లూయెన్సర్ జరా పటేల్.. లిఫ్ట్ ఎక్కుతున్న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈమె బదులు ఇక్కడ రష్మిక ముఖాన్ని డీప్ ఫేక్ చేసి ఓ అజ్ఞాత వ్యక్తి.. సదరు వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా వీడియో చేసిన వ్యక్తిని ఆంధ్రాలో అదుపులోకి తీసుకున్నారు. అతడు తెలుగు కుర్రాడే అని తెలిసింది కానీ పేరు, ఇతర వివరాలు మాత్రం బయటకు రాలేదు.

(ఇదీ చదవండి: చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక)

Advertisement
 
Advertisement