పల్లవరాజుల నాటి సంఘటనల ఆధారంగా ‘నందివర్మన్‌’ చిత్రం

Actor Suresh Ravi Next Seen in a Suspense Thriller Based on True Incident - Sakshi

చారిత్రక నేపథ్యంతో సస్పెన్స్, క్రైమ్‌ కథా త్రంగా రపొందుతున్న చిత్రం నందివర్మన్‌. ఏకే ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై టీ.అరుణ్‌ కువర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా పెరుమాళ్‌ వర్ధన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నా రు. ఈయన మరకతమణి, రాక్షసన్‌ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. సురేష్‌ రవి, ఆశా గౌడ జంటగా నటింన ఇందులో బోస్‌ వెంకట్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ.. కుంభకోణం సమీపంలోని చెంజికోటకు వెళ్లినప్పుడు జరుగుతున్న కొన్ని అమానుష సంఘటనల గురించి తెలిసిందన్నారు. పల్లవరాజుల నాటి సంఘటనలు, రాజేంద్ర వర్మ ఐదుగురు కొడుకులు గురించి ఇప్పటికీ అక్కడ కథలు కథలుగా చెప్పుకుంటారన్నారు. అక్కడ కనిపించకుండా పోయిన కొన్ని శిలలు పాండిచ్చేరిలో ఇప్పటికి అనామకంగా పడి ఉన్నాయన్నారు. చెంజికోటలో కొన్ని ప్రాంతాలకు ప్రజలు వెళ్లలేదని తెలిపారు. అలాంటి సంఘటనలకు కొంత కల్పిత అంశాలను జోడించి, తెరకెక్కించిన చిత్రం నందివర్మన్‌ అని చెప్పారు.

చిత్ర కథానాయకుడు సురేష్‌ రవి మాట్లాడుతూ కావల్‌ దురై ఉంగళ్‌ నన్బన్‌ చిత్రం తరువాత తాను నటించిన చిత్రం ఇదన్నారు. ఇందులో పోలీసుల చిత్ర హింసలకు గురైన తాను ఈ చిత్రంలో పోలీసు అధికారిగా నటించానన్నారు. ఈ చిత్రం తన కెరీర్‌కు హెల్ప్‌ అవుతుందా? అన్నదాని కంటే ఇందులో తాను నటించడానికి ప్రధాన కారణం దర్శక, నిర్మాతలు అని పేర్కొన్నారు. వారి ప్రతిభ, శ్రమ ఈ చిత్రం ఇంతవరకు రావడానికి కారణమన్నారు. చిత్రానికి చాలా శ్రమించానని, కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని నిర్మాత తెలిపారు. కాగా చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top