
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
పెద్దశంకరంపేట(మెదక్): త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని, ఆదిశగా కార్యకర్తలు, నాయకులు సంఘటితంగా పనిచేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండలానికి చెందిన పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే మోడల్ స్కూల్‌ను సందర్శించి ప్ర హరీ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. కేజీబీవీ విద్యాలయంలో అదనపు గదులు, టాయిలెట్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలో విద్యాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ షాకీర్‌అలీ, నాయకులు మధు, నారాగౌడ్, ఆర్‌ఎన్. సంతోష్ పాల్గొన్నారు.