
కల్లు కాదు.. కాలకూటం
మత్తులో చిత్తవుతున్న బతుకులు
● పీల్చి పిప్పి చేస్తున్న అల్ఫాజోలం ● జిల్లాలో 163 టీసీఎస్‌లు..303 టీఎఫ్‌టీలు ● అనధికారిక దుకాణాలు అనేకం
‘పాపన్నపేట మండలం చీకోడ్ గ్రామానికి చెందిన వృద్ధుడు లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి కల్లు తాగే అలవాటు ఉంది. ఇటీవల అనారోగ్యానికి గురి కాగా ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు కల్లు తాగొద్దని సూచించారు. అయితే కల్లు తాగకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు లోనయ్యాడు. ఆ వ్యధ భరించలేక రెండు వారాల క్రితం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.’
పాపన్నపేట(మెదక్): కల్తీ కల్లు అమాయకుల పాలిట కాలకూట విషంగా మారు తోంది. రసాయనాలతో తయారు చేసే కృత్రిమ కల్లు మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది. అల్ఫాజోలం లాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థంతో తయారైన కల్లు తాగిన వ్యక్తులు వ్యసన పరులుగా మారుతున్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మామూళ్ల మ త్తులో జోగుతున్న ఎకై ్సజ్ అధికారులకు చీమ కుట్టినట్లు లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సంఘటన జరిగితేనే కేసులు నమో దు చేసి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో 163 టీసీఎస్‌లు, 303 టీఎఫ్‌టీలు ఉండగా, అనధికారిక దుకాణాలు లెక్కకు మించి ఉన్నాయి. పల్లె పల్లెన, గల్లీ గల్లీలో కల్లు దుకాణాలు దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఆటోలో కల్లు పెట్టెలు పెట్టుకొని కొన్ని గ్రామాల్లో ఆటోలో కల్లు పెట్టెలు పెట్టుకొని ‘కల్లుచ్చొందమ్మా.. కల్లు అంటు’ వీధి వీధి తిరుగుతూ కల్తీ కల్లు విక్రయిస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు అటు వైపు తొంగి చూసిన పాపాన పోవడం లేదు.
తయారీ ఇలా..
జిల్లాలో ఈత, తాటి వనాలు ఉ న్నా, దుకాణదారులు కల్తీ కల్లునే విక్రయిస్తున్నారు. మత్తు కోసం ఎక్కువగా అల్ఫాజోలం, క్లోరోహైడ్రేట్, డైజోఫాం వాడుతున్నారు. చిక్కదనం, తెలుపు రంగు కోసం వైట్ పేస్ట్, రుచి కోసం చక్రీన్, నురగ రావడానికి కఫ్ పౌడర్ లాంటివి వాడుతున్నారు. ఈ మధ్య తక్కువ ఖర్చుతో మత్తు రావడానికి యాంటీ సైకోటిక్ డ్రగ్ వాడుతున్నారన్న అనుమానాలు పలు చోట్ల వ్యక్తమవుతున్నాయి. విరివిగా వాడుతున్న అల్ఫాజోలం కిలోకు రూ. 10 నుంచి రూ. 15 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. 10 గ్రాముల అల్ఫాజోలంతో సుమారు 1,200 కల్లు సీసాలను తయారు చేస్తున్నారు. పాపన్నపేట మండల శివారులోని ఓ దుకాణంలో రూ. 10కి ఎర్ర సీస, రూ. 15కు పచ్చ సీస, రూ. 30కి ప్లాస్టిక్ బాటిళ్లు (ఫీజ్‌లో పెట్టినవి) అమ్ముతున్నారు. ఇక్కడ మత్తు ఎక్కువగా ఉండటంతో యువకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నట్లు తెలుస్తుంది. మెదక్, చిన్నశంకరంపేట, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్‌చెరు కేంద్రంగా కొంత మంది దళారులు అల్ఫాజోలం దందా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో మెదక్‌కు చెందిన కొంత మంది యువకులు పాశమైలారం ప్రాంతంతో లాక్ అవుట్ అయిన ఓ ఫ్యాక్టరీని లీజుకు తీసుకొని, అందులో అల్ఫాజోలం తయారు చేశారనే ఆరోపణలున్నాయి. అలాగే మహారాష్ట్ర ఉమర్గ, ఖరాద్‌లోని పరిశ్రమల్లో సైతం ఇది తయారు చేస్తున్నట్లు సమాచారం. పూణె నుంచి కొంతమంది జహీరాబాద్, సంగారెడ్డి, ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది.
మామూళ్ల ‘మత్తు’లో ఎకై ్సజ్‌శాఖ
అధికారుల అండతోనే కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. నెలకు సుమారు రూ. 20 నుంచి రూ. 25 వేల వరకు ఎకై ్సజ్ అధికారులకు ముట్టజెప్పక తప్పదని కొంతమంది కల్లు దుకాణదారులు చెప్పడం గమనార్హం. స్టేషన్ స్థాయి అధికారులకు నెలకు రూ. 6 వేలు, సర్కిల్‌స్థాయి అధికారులకు రూ. 6 వేలు, జిల్లాస్థాయి వారికి ఆరు నెలలకు రూ.10 వేలు, స్పెషల్ పార్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులకు 6 నెలలకు రూ. 25 వేల వరకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. తమకు వచ్చిన ఆదాయంలో సింహభాగం మామూళ్లకే కరిగి పోతుందనివాపోయారు.
కల్తీ కల్లుకు కరిగిపోతున్న జీవితాలు ●
● తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన పాండు (43) పదేళ్లుగా పాపన్నపేటలో నివాసం ఉంటున్నాడు. కల్తీ కల్లుకు అలవాటుపడిన ఇత డు పండగ కోసం తమిళనాడు వెళ్లాడు. అక్కడ కల్లు దొరకక పిచ్చి, పిచ్చిగా ప్రవర్తించాడు. కుటుంబీకులు దయ్యం పట్టిందని అనుమానించి భూత వైద్యుడికి చూపెట్టారు. ఈలోగా పరిస్థితి విషమించి అక్కడే మరణించాడు.
● అనారోగ్యానికి గురై ఆస్పత్రికి వెళ్లిన పలువురు, కల్లు లేక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ చికిత్స సైతం తీసుకోకుండా వెనక్కివచ్చారు.
ఈ విషయమై అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా కల్తీ కల్లును అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశామన్నారు. ఎక్కడ కల్తీ కల్లు విక్రయాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఆ దుకాణాలపై కేసులు పెట్టండి
కల్తీ కల్లు విక్రయించే దుకాణాలపై కేసులు నమోదు చేయాలి. ఎకై ్సజ్ అధికారులు అన్ని దుకాణాలపై దాడులు చేసి గీత కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వం గీత కార్మికుల ఉపాధినిదృష్టిలో పెట్టుకోవాలి.
– నరేందర్‌గౌడ్,
పాపన్నపేట గౌడ సంఘం నాయకుడు