
42శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
మెదక్‌జోన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై బీజేపీ కట్టుబడి ఉందని, కేంద్రం ఒప్పుకోవడం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్టబద్దతలో భాగంగా ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ ఎలా కట్టబెడతారన్నారు. అలాంటప్పుడు అసలైన బీసీలకు అన్యాయం జరగదా అని ప్రశ్నించారు. బీసీల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేసి బీసీ నేతనే సీఎం చేయాలన్నారు. తెలంగాణలో పాలన పక్కన పెట్టిన సీఎం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తుంగలో తొక్కిందన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 12 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. 2028లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కాంగ్రెస్ దేశాన్ని దోచుకుందని, మోదీ సారథ్యంలో అవినీతి రహిత పాలన సాగుతుందన్నారు. అనంతరం ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ మెంబర్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు బీజేపీ అభ్యర్థులే గెలవాలన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూనే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌ను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సింగూరు ఆయకట్టు కింద బీడు భూములకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో మెదక్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. కష్టపడే కార్యకర్తను బీజేపీ గుర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు ప్రసాద్, ఎంఎల్‌ఎన్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, నందారెడ్డి, బక్కవారి శివ, రాజు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.