
మహేశ్‌కుమార్‌కుమతి భ్రమించింది
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్, హరీశ్‌రావుపై ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎంతమాత్రం నిజాలు లేవన్నారు. కేసీఆర్ తెలంగాణ తేకపోతే పీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిదని ప్రశ్నించారు. రేవంత్ మెప్పు కోసం స్థాయిని దిగజార్చుకొని మాట్లాడొద్దని హితవు పలికారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ గెలవని మహేశ్‌కుమార్ ప్రజలకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మా నాయకులను తిట్టడంపై ఉన్న శ్రద్ధ, రైతులకు యూరియా అందించడంలో చూపి ంచాలన్నారు. అసెంబ్లీ పెట్టండి చర్చకు సిద్ధం అని హరీశ్‌రావు రోజూ చెబుతున్నా కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగూరు నుంచి సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.