సీసీఐ కేంద్రాల్లోనే గిట్టుబాటు ధర | Sakshi
Sakshi News home page

సీసీఐ కేంద్రాల్లోనే గిట్టుబాటు ధర

Published Wed, Nov 15 2023 4:36 AM

-

హుస్నాబాద్‌: పత్తిని దళారులకు అమ్మి మోసపోకుండా సీసీఐ కేంద్రాల్లోనే విక్రయించి రైతులు ప్రభుత్వ గిట్టుబాట ధర పొందాలని వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి సుజన్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పత్తి విక్రయించాలనుకునే రైతులు కేంద్రాలకు ఆధార్‌ కార్డు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకం తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. ఆర్‌కె కాటన్‌ మిల్లు (పోతారం ఎస్‌), గోమాతా కాటన్‌ మిల్లు (హుస్నాబాద్‌), బాలాజీ కాటన్‌ మిల్లు (పందిల్ల), ఎస్‌ఆర్‌ఆర్‌ కాటన్‌ మిల్లు (పందిల్ల), మహాలక్ష్మి కాటన్‌ మిల్లు (జిల్లెల్లగడ్డ) సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7200 లభిస్తుందన్నారు. తేమ శాతం 8 నుంచి 12 శాతం ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తారని తెలిపారు.

 
Advertisement
 
Advertisement