వేసవిలో నీరు ఎక్కువగా తాగాలి

దీక్షలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, తదితరులు - Sakshi

నర్సాపూర్‌: వేసవిలో అందరూ నీరు ఎక్కువగా తాగాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి అనిత పే ర్కొన్నారు. మండల లీగల్‌ సర్వీస్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నీరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అంజిరెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

రెవెన్యూ డివిజన్‌ సాధించే వరకు విశ్రమించొద్దు

రామాయంపేట(మెదక్‌): రెవెన్యూ డివిజన్‌ సాధించేవరకు విశ్రమించొద్దని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మూడో రోజు దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదరణ కరువై రామాయంపేట పట్టణం అన్ని రంగాల్లో నష్టపోయిందన్నారు. గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామాయంపేట నేడు దయనీయంగా మారిందని వా పోయారు. రెవెన్యూ డివిజన్‌ విషయమై గతంలో మంత్రి ఇచ్చిన హామీలు సైతం అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. దీక్షకు వైఎస్సార్‌టీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వనపర్తి రోహిత్‌, బీజేపీ నాయకులు సంగయ్య, హన్మంతరావు, తదితరులు సంఘీభావం ప్రకటించారు.

కాంగ్రెస్‌ పేదల పక్షం

రామాయంపేట(మెదక్‌): పేదల పక్షాన నిలిచే ది కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరకు శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం నార్సింగి మండలం భీరాంవుపల్లి, నార్సింగి పట్టణంలో ఆత్మగౌరవ పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీలను విస్మరించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్ర జలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా భీంరావుపల్లిలో ఇతర పార్టీలకు చెందిన యువకులు శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌, నాయకులు గొండస్వామి, యాదగిరి, ఆకుల శ్రీనివాసగౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు స్వామి, మండల ప్రధాన కార్యదర్శి వినోద్‌, నా యకులు, తదితరులు పాల్గొన్నారు.

తైబజార్‌, పశువుల

సంత వేలం

తూప్రాన్‌: మున్సిపల్‌ పరిధిలో బుధవారం ని ర్వహించిన తైబజార్‌, పశువుల సంతకు వేలం ద్వారా రూ. 21.70 లక్షల ఆదాయం సమకూరిందని మున్సిపల్‌ కమిషనర్‌ మోహన్‌ తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటలో పట్టణానికి చెందిన రత్నయ్య తైబజార్‌కు రూ.19.90 లక్షలు, పశువుల సంతకు మ్యాకల శ్రీనివాస్‌ రూ.1.80 లక్షలకు వేలం పాట దక్కించుకున్నారని తెలిపారు. ఈ వేలం ఏడాది పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top