అంతరిస్తున్న అడవులు

ఇటీవల అగ్నికి ఆహుతైన రాయినిపల్లి అడవి - Sakshi

మెదక్‌జోన్‌: అక్రమార్కుల గొడ్డలి వేటుకు అడవులు అంతరించిపోతున్నాయి. జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, కౌడిపల్లి, రామాయంపేట, అల్లాదుర్గం, తూప్రాన్‌ ఫారెస్ట్‌ రేంజ్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 145 ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. కాగా జిల్లా భూ భాగానికి 33 శాతం మేర అడవులు ఉండాల్సి ఉండగా కేవలం 24 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన మరో తొమ్మిది శాతం తక్కువగా ఉన్నాయి.

● అడవుల పెంపు కోసం ఏటా హరితహారంలో అధికారులు విరివిగా మొక్కలు నాటుతున్నారు.

● లక్షలాది రూపాయలు వెచ్చించి వాటి పరిరక్షణకు పాటుపడుతున్నారు. కానీ కొన్ని చోట్ల సంరక్షణలో అధికారులు విఫలం అవుతున్నారు.

● రహదారుల గుండా వెళ్లే బాటసారులు బీడీ, చుట్ట, సిగరేట్‌ లాంటివి కాల్చి పడేయడంతో ఆకులు తగలబడి అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి.

● ఇందుకోసం వేసవి ఎండలు ముదరక ముందే సేఫ్టీ ఫైర్‌లైన్‌ చేయాలి. కానీ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవటంతో తగలబడుతున్నాయి.

● ఇటీవల కొంటూర్‌– రాయినిపల్లి ప్రధాన రహదారి పక్కన సుమారు 50 ఎకరాల అడవి తగలబడింది.

● అలాగే అడవులను ఆనుకొని ఉన్న గ్రామాల్లో విచ్చలవిడిగా నరికివేతకు పాల్పడుతున్నారు.

● ముఖ్యంగా మెదక్‌ రేంజ్‌ పరిధిలోని భూర్గుపల్లి, గాజిరెడ్డిపల్లి, బొగుడ భూపతిపూర్‌తో పాటు రామాయంపేట రేంజ్‌లో ఆక్రమణలు జోరుగా ఉన్నట్టు సమాచారం.

● అంతేకాకుండా మేకల కాపరులు ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేస్తున్నారు. కొందరు క్షేత్రస్థాయి అధికారులు మామూళ్ల మత్తులో అక్రమార్కులకే మద్దతు ఇస్తున్నారు.

● అలాగే అడవిలోని టేకుతో పాటు ఇప్ప, మద్ది చెట్లను అక్రమార్కులు దర్జాగా నరికి దుంగలను తీసుకెళ్తున్నారు. రాయినిపల్లి అటవీ ప్రాంతంలో ఎండిపోయిన తర్వాత తీసుకెళ్తున్నారు.

ఇష్టారాజ్యంగా నరికివేత

మరోవైపు అగ్నికి ఆహుతి

చోద్యం చూస్తున్న అధికారులు

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top