పిల్లల సమస్యలను తొలిదశలోనే గుర్తించాలి

అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌ జగదీశ్‌ 
 - Sakshi

అపోలో వైద్య విజ్ఞాన సంస్థ విభాగాధిపతి డాక్టర్‌ జగదీశ్‌

తూప్రాన్‌: పిల్లల్లో వచ్చే శారీరక, మానసిక సమస్యలను తొలిదశలోనే గుర్తించాలని అపోలో వైద్య విజ్ఞాన సంస్థ డెవలప్‌ మెంట్‌ హెల్త్‌ సెంటర్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఏ.జగదీశ్‌ అన్నారు. మంగళవారం పట్టణంలో. శ్రీపిల్లల్లో న్యూరోలాజికల్‌ సమస్యలు– నివారణశ్రీ అనే అంశంపై తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ యాదగిరి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో తొలిదశలోనే సమస్యలను గుర్తించడం వల్ల సమస్యలు దూరం చేయవచ్చన్నారు. ఏకాగ్రత, ప్రత్యేక అభ్యసన లోపాలు, ఆటిజం, పక్క తడపడం, ఆందోళన మొదలైన సమస్యలు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలన్నారు. విద్యార్థుల సమస్యలను దూరం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు. మెదక్‌ జిల్లాలో వెల్దుర్తి, మాసాయిపేట, తూప్రాన్‌, మనోహరాబాద్‌, నర్సాపూర్‌, శివ్వంపేట మండలాల్లో విద్యాశాఖ– అపోలో వైద్య విజ్ఞాన సంస్థ సంయుక్తంగా న్యూరోలాజికల్‌ సమస్యలపై ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్‌ ఆర్‌.సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. కార్యక్రమంలో విలీన విద్య రిసోర్స్‌ టీచర్లు సంధ్య, వకుళ, సీఆర్పీలు స్వాతి, రమేశ్‌, తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top