డీఈఓ కార్యాలయంలో కంట్రోల్‌ రూం

నర్సంపల్లి తండాలో పాదయాత్ర 
చేస్తున్న శ్రీనివాసరెడ్డి - Sakshi

మెదక్‌ కలెక్టరేట్‌: పదో తరగతి విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం డీఈఓ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని డీఈఓ రాధాకిషన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు. పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి 7207704500, జిల్లా సైన్స్‌ అధికారి 8328599157, పరీక్షల సహాయ కమిషనర్‌ 9491676947, రిసోర్స్‌ పర్సన్‌ 9492827089 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి

రామాయంపేట(మెదక్‌): కాంగ్రెస్‌ హయాంలోనే నిజమైన అభివృద్ధి జరిగిందని దుబ్బాక కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నార్సింగి మండలం న ర్సంపల్లి, పెద్ద తండా, చిన్న తండాలో ఆత్మగౌరవ పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్ధిని ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇళ్లు నిర్మించుకునే వారికి రూ. ఐదు లక్షలు మంజూరు చేస్తుందని తెలిపారు. రూ. ఐదు వందలకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. నార్సింగి మండలం పూర్తిగా వివక్షకు గురైందని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలశాఖ అధ్యక్షుడు గోవర్ధన్‌, జిల్లా నాయకులు గొండస్వామి, యాదగిరి, రఫీక్‌, శ్రీనివాస్‌గౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు స్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, నాయకులు సుధాకర్‌, ప్రవీణ్‌రెడ్డి, కుర్షీద్‌, తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం

టేక్మాల్‌(మెదక్‌): పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ భారతి అన్నారు. సోమవారం మండలంలోని సాలోజిపల్లిలో పోషణ్‌ పక్వాడ వారోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆకుకూరలతో పాటు చిరు ధా న్యాలను ఆహారంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ హర్షబేగం, పంచాయతీ కార్యదర్శి అజ్మిర్‌మియా, అంగన్‌వాడీ టీచర్‌ తిరుమల, ఆశవర్కర్‌ పాల్గొన్నారు.

అంగన్‌వాడీ ఆయాకు

టీచర్‌గా పదోన్నతి

కౌడిపల్లి(నర్సాపూర్‌): కౌడిపల్లిలోని నాల్గవ అంగన్‌వాడీ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న అంగన్‌వాడీ ఆయా రజియా సుల్తానా అంగన్‌వాడీ టీచర్‌గా పదోన్నతి పొందింది. సోమ వారం ఐసీడీఎస్‌ నర్సాపూర్‌ ప్రాజెక్ట్‌ సీడీపీఓ హేమభార్గవి నియామకపత్రం అందజేసింది. అంగన్‌వాడీ టీచర్‌ సంతోష సూపర్‌వైజర్‌గా పదోన్నతిపై వెళ్లడంతో పోస్ట్‌ ఖాళీ అయింది. దీంతో ప్రభుత్వం ఆయాకు టీచర్‌గా పదోన్నతి కల్పించింది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రజియాసుల్తానా రాష్ట్ర ఉత్తమ అంగన్‌వాడీ ఆయాగా అవార్డు అందుకుంది.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top