జలసిరి

మెదక్‌ మండలంలో బోరు నుంచి వస్తున్న నీరు - Sakshi

మెదక్‌జోన్‌: వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడం మెతుకు సీమకు కలిసొచ్చింది. జిల్లావ్యాప్తంగా నీటి వనరులు పొంగిపొర్లగా వేసవిలోనూ భూగర్భ జలమట్టం స్థిరంగా ఉంది. గతేడాదితో పోల్చితే 18 సెంటీమీటర్ల వ్యత్యాసంలో భూగర్భజలాలు ఉన్నాయి. ఇది శుభ పరిణామమని అధికారులు చెబుతుండగా.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో గత కొన్నేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఫలితంగా చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. ఈఏడాది జిల్లాలో సగటున 12.16 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో జిల్లాలో సగటున 11.96 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఈఏడాది 18 సెంటీ మీటర్ల తేడాతో సమృద్ధిగా ఉన్నాయి. అట్టడుగున కొల్చారం మండలం ఉంది. ప్రస్తుతం ఈ మండలంలో 20.84 మీటర్ల లోతులోకి నీటి ఊటలు పడిపోయాయి. ఇది ప్రమాదకర పరిస్థితి అని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఇక్కడ 20 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా ఈఏడాది మరో 84 సెంటీ మీటర్ల లోతులోకి నీటి మట్టం పడిపోయింది. అలాగే శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో కేవలం 3.49 మీటర్లలోతులోనే నీరు పుష్కలంగా ఉంది. రెండోస్థానంలో పిల్లికొటాల్‌లో 4.37 మీటర్ల లోతులో నీరు ఉంది. కాగా పిల్లికొటాల్‌ పక్కనే మహబూబ్‌నహర్‌(ఎంఎన్‌) కెనాల్‌తో పాటు పుష్పల వాగు ఉంది. ఈ కెనాల్‌ మట్టితో ఉండడంతో ఘనపూర్‌ ప్రాజెక్టు నుంచి దిగువన గల వరి పంటలకు నీరు వదిలిన ప్రతిసారి ఇక్కడ భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయి. అంతే కాకుండా గ్రామాన్ని ఆనుకుని పుష్పలవాగు ఉండడంతో భూగర్భజలాలు పైపేనే ఉంటున్నాయి.

హల్దీలోకి గోదారి.. తోడుగా కాళేశ్వరం

శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో ప్రాంతంలో ఎలాంటి నీటి వనరులు లేవు, కనీసం చెప్పుకోదగ్గ చెరువు సైతం అందుబాటులో లేదు. కానీ ఇక్కడ కేవలం 3.49 మీటర్ల లోతులోనే నీరు ఉండడానికి కారణం అంతుచిక్కడం లేదు. మూడోస్థానంలో మనోహరాబాద్‌ మండలం ఉంది. ఇక్కడ 6.92 మీటర్ల లోతులేనే నీరు ఉంది. నాల్గవ స్థానంలో చేగుంటలో 7.64 మీటర్లు, చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో 7.82 మీటర్లు లోతులో నీరు ఉంది. వ్యవసాయానికి విద్యుత్‌ను గణనీయంగా తగ్గించడం భూగర్భజలాలు పుష్కలంగా ఉండేందుకు మరో కారణమని చెప్చొచ్చు. అలాగే జిల్లాలో 50 కిలోమీటర్ల మేర ప్రవహించే హల్దీ ప్రాజెక్టులోకి గోదావరి జలాలను వదలడం, నిజాంపేట, రామాయంపేట, చేగుంట మండలాలకు కాళేశ్వరం నీరు రావడం కూడా భూగర్భ జలమట్టం పెరగడానికి కారణంగా తెలుస్తోంది.

నీరు పుష్కలంగా ఉంది

వానాకాలం వర్షాలు దంచికొట్టడంతో బోరులో నీరు పుష్కలంగా ఉంది. కరెంట్‌ రోజుకు రెండు దశల్లో 12 గంటలు మాత్రమే ఇస్తున్నారు. 24 గంటల ఇస్తే బోరు బావుల్లో నీరు తగ్గేది.

– సిద్దిరెడ్డి, రైతు, జంగరాయి

జిల్లాలో సగటున 12.16 మీటర్లలో

భూగర్భజలాలు

అట్టడుగున కొల్చారం..

శివ్వంపేటలో ౖపైపెనే

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top