అభివృద్ధి పనులు పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు పూర్తి చేయండి

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

బెల్లంపల్లి: బెల్లంపల్లిలో తలపెట్టిన అభివృద్ధి పనులను సత్వరంగా పూర్తి చేయించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణ శివారులో అమృత్‌ 2.0 గోదారి నీటి పథకం పనులు, రైల్వేస్టేషన్‌ ఏరియాలోని ఫిల్టర్‌బెడ్‌ పనులు, అంబేడ్కర్‌ రడగంబాల బస్తీలో పురాతన జాతికుంట చెరువు సుందరీకరణ పనులు పరిశీలించారు. జాతికుంట చెరువు శిఖం భూములు దురాక్రమణకు గురి కాకుండా చుట్టూ కందకం తవ్వించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దావ స్వాతి, కమిషనర్‌ తన్నీరు రమేష్‌, కౌన్సిలర్‌ కాంపల్లి రాజం, కాంగ్రెస్‌ నాయకులు దావ రమేష్‌బాబు, కంకటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి

బెల్లంపల్లి: గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. శనివారం పట్టణంలోని అంబేడ్కర్‌ రడగంబాల బస్తీలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దావ స్వాతి, కమిషనర్‌ తన్నీరు రమేష్‌, బెల్లంపల్లి రూరల్‌ సీఐ సీహెచ్‌.హనోక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టూటౌన్‌ ఎస్సై సీ.హెచ్‌.కిరణ్‌కుమార్‌, కౌన్సిలర్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement