పాల నుంచి భోజనం వరకూ అన్నీ కల్తీనే! కల్తీ తినుబండారాలతో అనారోగ్యం అప్రమత్తత అవసరమంటున్న వైద్యులు నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం
ఆకర్షణీయ రంగులతో ఉన్న ఆహార పదా ర్థాల కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి.
ప్యాకెట్ ఆహారాలపై తయారీ, గడువు తేదీలను పరిశీలించాలి.
పరిశుభ్రత లేని ప్రాంతాల్లో విక్రయించే ఆహారాన్ని వీలైనంత వరకు నివారించాలి.
ఆహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
అనుమానాస్పద ఆహారపదార్థాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.
నిర్మల్‌ఖిల్లా: ఆహారం ఆరోగ్యానికి మూలాధారం. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో పాల నుంచి భోజనం, ఆహార పదార్థాలు, తినుబండారాల వరకు కల్తీ బారిన పడుతున్నాయి. ఆకర్షణీయంగా కృత్రిమ రంగులు, రసాయనాలు, నాణ్యతలేని పదార్థాలను ఉపయోగించడం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రమాదంలో పడుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే చిప్స్‌లు, స్వీట్లు, ఐస్‌క్రీములు, బేకరీ ఉత్పత్తులు, శీతల పానీయాల్లో ఈ కల్తీ ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. జూన్ 7న నిర్వహించే ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ‘సురక్షిత ఆహారం ప్రతీ ఒక్కరి హక్కు’అనే సందేశాన్ని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.
గత ఘటనలు కలకలం
తనిఖీలు ముమ్మరం చేస్తేనే..
జిల్లాలో ఆహారభద్రత అధికారుల తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, వీధి వ్యాపారుల వద్ద విక్రయించే ఆహార పదార్థాల నమూనాలు సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించాలని సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..


