మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జిల్లా అభివృద్ధి జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆర్మూర్–మంచిర్యాల మధ్య నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ కోసం రూ. 5,203 కోట్లతో జాతీయ రహదారి చేపట్టేందుకు ఆమోదం తెలిపినందుకు గురువారం జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌తో కలిసి మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ చంద్రపూర్–మంచిర్యాల జాతీయ రహదారి 363 ఇప్పటికే పూర్తి చేయగా, మంచిర్యాల–విజయవాడల మధ్య 63వ జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. దీంతో జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుండగా, పారి శ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణమూర్తి, సంజీవ్‌రావు, బంగారు వేణుగోపాల్, రమేశ్, మల్యాల రాజమల్లు, ముదాం మల్లేశ్, కుర్రె చక్రవర్తి, సత్రం రమేశ్, ధన్‌సింగ్, బేరా రామన్న యాదవ్, సప్పిడి నరేశ్, బూర రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.


