మంచిర్యాలఅర్బన్/మామడ: రాష్ట్రప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పింది. ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది సాధారణ టెట్‌లకు అదనంగా మరో రెండు ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించాలని అనుమతి ఇచ్చింది. తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించడంపై టీచర్లల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ల నుంచి వచ్చిన వినతులను పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంది.
రెండేళ్ల గడువుకు రెండు టెట్‌లు..
సర్కారు బడిలో పాఠాలు బోధించే టీచర్‌కు టెట్ తప్పనిసరి ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కలవరానికి గురిచేసింది. విధుల్లో కొనసాగాలన్నా.. పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణతకు రెండేళ్ల గడువు విధించడంతో వారిలో ఆందోళన మొదలైంది. 2012కు ముందు బీఈడీతో పరీక్షలు రాసి ఉద్యోగంలో చేరిన టీచర్లకు టెట్ లేకపోవడంతో పదవీ విరమణకు దగ్గరున్నవారు, పదోన్నతి పొందాలనే వారిలో నిరాశ నింపింది. జాతీయ విద్యావిధానం ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు అర్హత పరీక్ష పొందాలని సెప్టెంబర్ 1న 2025 ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో నోటిఫికేషన్ జారీ కావడం.. జనవరి 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలను ఆన్‌లైన్ నిర్వహించడంతో టెట్ ఉత్తీర్ణతలేని టీచర్లు పరీక్ష రాశారు. మరోసారి సర్వీసు టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహణతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది.
టెట్‌లేని వారే అత్యధికం
అత్యధికంగా టెట్ ఉత్తీర్ణత లేని ఉపాధ్యాయులే అధికంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో 2507 మంది ప్రభుత్వ టీచర్లు ఉంటే 945 మంది మాత్రమే టెట్ ఉత్తీర్ణత ఉన్నట్లు తేలింది. నిర్మల్ జిల్లాలో 2565 మంది టీచర్లకు 1490 మంది ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణతను సాధించాల్సి ఉంది. ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్షలో మరికొంత మందిటీచర్లు ఉత్తీర్ణులైనప్పటికీ. అన్‌లైన్ పరీక్షల నిర్వహణతో వివరాలు విద్యాశాఖ కార్యాలయాల్లో తెలియకుండా పోయింది. ఓవైపు పాఠాలు.. మరో వైపు టెట్‌కు సన్నద్ధం కొంత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఇన్‌సర్వీసు టీచర్లకు ప్రత్యేకంగా రెండు టెట్ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వటంతో టీచర్లకు ఉపశమనం కలిగిస్తోంది.
బోధన చేస్తున్న ఉపాధ్యాయులు


