సమస్యపై స్పందించని ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

సమస్యపై స్పందించని ఎమ్మెల్యే

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

పెంబి: గిరిజన ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి అటవీశాఖ అనుమతులు పేరుతో అడ్డుకుంటున్నారని పెంబి అటవీ కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన కొనసాగుతోంది. గురువారం పెంబి మండల పర్యటనకు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ వచ్చినా కనీసం తమ సమస్య తెలుసుకునేందుకు దీక్ష శిబిరానికి రాలేదని ఆదివాసీలు వాపోయారు. ఆదివాసీ బిడ్డను గెలిపించుకుంటే సమస్యలు తీరుతాయని అనుకుంటే ఎ మ్మెల్యే స్పందించకపోవడం బాధాకరమన్నారు. అ యితే వర్షంలో నిరసన చేపట్టారు. సీపీఎం నేతలు సురేష్‌, తదితరులు మద్దతు ప్రకటించారు. ఆదివాసీ నాయకులు నిర్మ ల, బాపురావు, లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement