ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూర్‌: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు, నిల్వ, రవాణా ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం చెన్నూర్‌లోని గోదాం, వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లు, ఓత్కులపల్లి, ఆస్నాద్‌, సోమన్‌పల్లి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. గోనె సంచులు, టార్పాలిన్‌ కవర్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని గోదాములకు తరలించాలన్నారు. అధికారులు సమన్వయంతో గడువులోగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఆర్‌ఐ అజీజ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement