ఖానాపూర్: మండలంలోని గోసంపల్లి గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. పలువురు పేదలకు చెందిన గుడిసెలు ద గ్ధమయ్యాయి. నివాసాల సమీపంలో ఉన్న పంట పొలాల నుంచి వ్యాపించిన మంటలు ఇళ్ల వరకు చే రుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బేడ బు డగ జంగం కులస్తులకు చెందిన మూడు గుడిసెల కు మంటలు అంటుకోగా, గడ్డం బసవలింగంకు చెందిన ఇల్లు దగ్ధమైంది. గడ్డం అంజన్న, వినుకొండ వెంకటేశ్‌లకు చెందిన ఇల్లు స్వల్పంగా దెబ్బ తిన్నాయి. స్థానికులు అప్రమత్తమై గుడిసెల్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ప్రాణపాయం తప్పింది. అనంతరం గ్రామస్తులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఇంటి సామగ్రి, నిత్యావసరాలు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.
పంట వ్యర్థాలకు నిప్పు
లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి(కే) సమీపంలోని ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు వరి పంట వ్యర్ధాలకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. గాలి దుమారానికి గ్రామ సమీపం వరకు వ్యాపించాయి. 100 నుంచి 150 ఎకరాల్లో వరి వ్యర్థాలు కాలిపోయాయి. పొగ వల్ల బీసీ, ఎస్టీ కాలనీల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. గ్రామస్తులు పంచాయతీ ట్యాంకర్‌తో చెట్ల కొమ్మలు, నీళ్ల బకెట్లతో మంటలార్పివేశారు.
బాబెరతండాలో రెండు ఇళ్లు..
బోథ్: మండలంలోని బాబెరతండాలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. జాదవ్ హీరాలాల్, జాదవ్ దేవిదాస్‌లకు చెందిన ఇళ్లపై విద్యుత్ వైర్లు తెగి మంటలు చెలరేగాయి. ఇళ్లల్లో వస్తువులు, పత్రాలు, నగదు కాలిపోయాయి. దాదాపు రూ.7 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


