సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన యువత అసామాన్య ప్రతిభతో సత్తాచాటారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మైదానంలో చెమటోడ్చారు. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపట్టి తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించారు. దేశసేవ చేయడమే ధ్యేయంగా భారత సైనికదళంలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. వారి కష్టానికి విజయం దాసోహమంది. వారి పట్టుదలకు అగ్నివీర్ కొలువులు దక్కాయి. శనివారం రాత్రి విడుదలైన అగ్నివీర్ ఎంపిక ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన ఉమ్మడి జిల్లా యువకులపై కథనం. – ఆదిలాబాద్


