ధాన్యం దిగుమతి వేగవంతం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం దిగుమతి వేగవంతం చేస్తాం

May 23 2026 11:57 PM | Updated on May 23 2026 11:57 PM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

బెల్లంపల్లి/భీమారం: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని రైస్‌మిల్లుల్లో దిగుమతిని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అధికారులను ఆదేశించారు. శనివారం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాం, భీమారం మండల కేంద్రంలోని సమత రైస్‌ మిల్లును సందర్శించారు. కొనుగోలు ధాన్యాన్ని వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించడమే కాకుండా దిగుమతి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బెల్లంపల్లిలో సింగరేణి క్లబ్‌ను సందర్శించి ధాన్యం నిల్వకు అవకాశాలను పరిశీలించారు. ధాన్యం నిలువ చేయడానికి అవసరమైన అనుమతులు పొందాలని అధికారులకు సూచించారు. బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, తహసీల్దార్లు కృష్ణ, సదానందం, ఆర్‌ఐ రజిత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement