బెల్లంపల్లి: పాలిసెట్ ఫలితాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ పొందిన విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఉచిత శిక్షణకు 161 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా రెగ్యులర్‌గా హాజరైన 136 మంది ప్రతిభ చాటుకున్నారు. వీరిలో 11 మంది పదివేల లోపు ర్యాంకులు సాధించడం గమనార్హం. ఓరుగంటి నిత్యశ్రీ 796, ఎండి.చాహత్ 1981, బేరి మల్లికార్జున్ 2937, వెంగళ ఈశ్వర్ 4498, పెద్దపల్లి అజయ్ 4789, గుడిసెల మనోజ్ఞ 4971 ర్యాంకులతో సత్తా చాటారు. విద్యార్థులతోపాటు కళాశాల అధ్యాపకులు, పాలి క్వెస్ట్ ఇంచార్జి వెంకటేశ్వర్లు, కోచింగ్ ఇన్‌చార్జి శివకృష్ణ, తదితరులను బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవేందర్ ప్రశంసించారు.


