వీవోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

వీవోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి

May 23 2026 11:57 PM | Updated on May 23 2026 11:57 PM

నెన్నెల: వీవోఏలను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి ఆరోగ్య భద్రత కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం వీవోఏలు నెన్నెలలో చేపట్టిన నిరవధిక సమ్మెకు శనివారం బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌గౌడ్‌ మాట్లాడుతూ వీవోఏల శ్రమను దోచుకుంటున్నారని, కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని, సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్‌ పాలసీ వర్తింపజేయాలని అన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు అంగలి శేఖర్‌, నాయకులు నల్ల రాజేందర్‌, తిరుపతి, శైలేందర్‌సింగ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement