● గజ గజ వణుకుతూ చన్నీళ్ల స్నానం ● నేలపైనే విద్యార్థుల చ
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. బయటకు వస్తే గజ గజ వణికిపోవాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వ వసతిగృహాల్లోని విద్యార్థుల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంది. స్నానానికి వేడి నీరు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల భవనాలకు కిటికీ తలుపులు లేకపోవడం, సరైన వసతులు లేక శీతలగాలులకు తట్టుకోలేకపోతున్నారు. వసతిగృహాల్లో నూతనంగా చేరిన విద్యార్థులకు ఉన్ని దుప్పట్లు, చద్దర్లు పంపిణీ చేశారు. ఎస్సీ సంక్షేమ శాఖ విద్యార్థులకు స్వెట్టర్లు పంపిణీ చేయగా.. బీసీ వసతిగృహాల్లోని వారు వణుకుతూ నేలపైనే కూర్చుని చదువుకుంటున్నారు. మంచాలు, పరుపులు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 24 ఎస్సీ వసతిగృహాలు ఉండగా.. 2,143మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఎనిమిది పోస్టుమెట్రిక్‌లో 1,200మంది, 16ప్రీమెట్రిక్ హాస్టళ్లలో 960 మంది ఉన్నారు. అప్పట్లో 15చోట్ల సోలార్ వాటర్‌హీటర్లు ఏర్పాటు చేయగా.. దొనబండలో మాత్రం పని చేస్తున్నాయి. మిగతా చోట్ల కోతుల కారణంగా పలకలు పగిలి పనికి రాకుండా పోయాయి. 18 బీసీ వసతిగృహాల్లో 1,592మంది విద్యార్థులు ఉన్నారు. అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య ఇబ్బందులు పడుతున్నారు. 15 ఎస్టీ ప్రీమెట్రిక్, రెండు పోస్టుమెట్రిక్ వసతిగృహాలు ఉన్నాయి. ఇందులో 2,785మంది వసతి పొందుతున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వేడి నీళ్లు అందించేందుకు సోలార్ వాటర్‌హీటర్ ఏర్పాటు చేసినా పని చేయడం లేదు. దీంతో అక్కడక్కడ వేడినీళ్లు కాచి అందిస్తున్నారు. ప్రస్తుతం సోలార్‌హీటర్ల మరమ్మతులు పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు అన్ని వసతిగృహాల్లో వేడి నీరు అందుబాటులో లేక చన్నీటితో స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
● గజ గజ వణుకుతూ చన్నీళ్ల స్నానం ● నేలపైనే విద్యార్థుల చ
● గజ గజ వణుకుతూ చన్నీళ్ల స్నానం ● నేలపైనే విద్యార్థుల చ


