స్నానం చేయాలంటే వణుకే..
నెన్నెల: మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 80 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరేళ్ల క్రితం రూ.2.25 లక్షలతో సోలార్ వాటర్ హీటర్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. గత నాలుగేళ్లుగా పని చేయడం లేదు. దీంతో విద్యార్థులు చలిలో వణుకుతూ చన్నీళ్ల స్నానం చేయాల్సి వస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో జలుబు, జ్వరాలతో బాధపడుతున్నారు. అధికారులు స్పందించి వేడి నీటి యంత్రం మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.
తాండూర్‌లో..
తాండూర్: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిభా ఫూలే బాలుర గురుకుల విద్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. 480 మంది విద్యార్థులు ఉండగా.. సరిపడా గదులు లేక పగటి పూట చదువుకుంటూ రాత్రిపూట అవే గదుల్లో కిక్కిరిసి నిద్రపోతున్నారు. సోలార్ హీటర్ సౌకర్యం లేక చన్నీటి స్నానం చేస్తూ చలికి వణుకు తున్నారు.
స్నానం చేయాలంటే వణుకే..


