కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
దండేపల్లి/లక్సెట్టిపేట: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, బాధ్యతగా నచ్చని వారికే ఓటు వేయాలని సూచించారు. సోమవారం ఆయన దండేపల్లి మండలం కాసిపేట, దండేపల్లి, లక్సెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోటీ చేస్తున్న అభ్యర్థులు, నాయకులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహాసీనొద్దీన్, ఎస్సై గోపతి సురేష్, ఏఎస్సై అన్వర్, తదితరులు పాల్గొన్నారు.


