నేడు ‘మూడో విడత’ ఉపసంహరణ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘మూడో విడత’ ఉపసంహరణ

Dec 9 2025 10:37 AM | Updated on Dec 9 2025 10:37 AM

నేడు ‘మూడో విడత’  ఉపసంహరణ

నేడు ‘మూడో విడత’ ఉపసంహరణ

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): జిల్లాలో మూడో విడత భీమారం, చెన్నూర్‌, జైపూర్‌, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని 102 పంచాయతీలు, 868 వార్డులో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వం 5న ముగిసింది. ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించి తుది జాబితా ప్రకటిస్తారు. 102 పంచాయతీలకు 613 నామినేషన్లు వచ్చాయి. 868 వార్డులకు 3 చోట్ల నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 865 వార్డుల్లో 2,070 మంది పోటీలో ఉన్నారు. గుర్తుల కేటాయింపుతో ప్రచార పర్వానికి తెరలేవనుంది. 17న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు, అదే రోజు ఉప సర్పంచ్‌ ఎన్నిక ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement