‘మధుకర్ ఆత్మహత్య కారకులను అరెస్ట్ చేయాలి’
తాండూర్: బీజేపీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు కారణమైన నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డి మాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల వేధింపులు తాళలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. నిందితులు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై స్టే రద్దు చేసినప్పటికీ పోలీసులు నిందితులను అరెస్ట్ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. బీజేపీ జిల్లా కార్యదర్శి మహీదర్‌గౌడ్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు పులుగం తిరుపతి, నాయకులు శేషగిరి, గోవర్ధన్, చిరంజీవి, విజయ్, శ్రావణ్, తిరుపతి పాల్గొన్నారు.


