తపస్ జిల్లా కమిటీ ఎన్నిక
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో ఆదివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివా రం సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, రాష్ట్ర అకడమిక్ కోకన్వీనర్ వి ద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బగ్గని రవికుమార్, భారతీ అశోక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అనంతరం జిల్లా పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు జరుగుతుందని ఎన్నికల పరిశీలకులు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారి శ్రీనివాస్, పరిశీలకులు వెంకటేశ్వర్లు, వెంకటరమణ, 15 మండలా ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.


