మెనూ ప్రకారం భోజనం అందించాలి
మంచిర్యాలఅర్బన్: హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు మెనూ ప్రకారం మెరుగైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అ ధికారి రమాదేవి అన్నారు. ఆదివారం పట్ట ణంలోని ఎస్టీ బాలికల వసతిగృహాన్ని తనిఖీ చేశా రు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అన్నం ముద్దవుతున్న విషయం ఆమె దృష్టికి తీసుకురాగా అవసరమైతే బియ్యం మారుస్తామన్నారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని, పరి సరాలు పరిశుభ్రంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతకముందు కిచెన్ గది, సరుకులు, నీటి నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె వెంట ఏటీడబ్ల్యూవో సురేష్, వార్డెన్ స్వప్న, తదితరులు ఉన్నారు.
దేవాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాల తనిఖీ
కాసిపేట: మండలంలోని దేవాపూర్ బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆదివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీవో) రమాదేవి తనిఖీ చేశారు. పాఠశాల పరిశుభ్రత పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలను స్టోర్‌రూమ్, రిజిష్టర్‌లు, మినరల్ వాటర్, టాయిలెట్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీవో సురేష్, హెచ్‌డబ్ల్యూవో సుశీల, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఏఎన్‌ఎం గంగాదేవి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


