ఆంక్షల కోడ్..
అడపిల్ల పెళ్లికి.. రూ.5,016 పేదల అంత్యక్రియలకు నగదు ఆలయ నిర్మాణానికి రెండు గుంటల భూమి హామీ
నిర్మల్‌చైన్‌గేట్: పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు అలర్ట్‌గా ఉండాలి. లేదంటే ఎన్నికలకు దూరమయ్యే పరిస్థితి రావొచ్చు. ఎందుకంటే ఎన్నికల ప్రవర్తన నియమావళిని(కోడ్) ఉల్లంఘించిన వారిని పోటీ చేయకుండా నిషేధించే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఎన్నికల సంఘం వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయొచ్చు. నేరం రుజువైతే జైలు శిక్ష కూడా పడొచ్చు. అందుకే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే.
కోడ్ ఎందుకంటే..
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీనినే ‘మోడర్ ఆఫ్ కోడ్ కండక్ట్ (ఎంసీసీ) అంటారు. ఏదైనా రాజకీయ పార్టీ, అభ్యర్థి ఈ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకుంటుంది.
నిబంధనలు ఇవే..
ఇతర హామీలతో
ప్రకటించిన మేనిపెస్టో
బాండ్ పేపర్‌తో శ్రీధర్‌గౌడ్
నగదు రూ.50 వేలకు మించి ఉండొద్దు
రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తన వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండి దానికి సంబంధించిన సరైన పత్రాలు చూపలేకపోతే పోలీసులు సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో లభించిన డబ్బు ను రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. ఎక్కువ ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి సదరు డబ్బును కోర్టులో జమ చేస్తారు.
సర్పంచ్ అభ్యర్థి బాండ్‌పేపర్
ఖానాపూర్: బాండ్‌పేపర్‌పై రాసిన మేనిఫెస్టోతో మండలంలోని బీర్నంది పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మూల శ్రీధర్‌గౌడ్ వినూత్న ప్రచారం చేపట్టాడు. గ్రామంలోని యాదవ కులస్తులకు మల్లన్నస్వామి ఆలయ నిర్మాణానికి రెండు గుంటల భూమి విరాళంగా ఇస్తానని, రూ.50 విలువ గల బాండ్ పేపర్‌పై లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఇదే తరహాతో ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు ప్రకటించారు. ప్రతీ ఆడపిల్ల పెళ్లికి రూ.5016, పేదలు మరణిస్తే రూ. 5 వేలు ఇస్తానని తెలిపారు.
ఆంక్షల కోడ్..
ఆంక్షల కోడ్..
ఆంక్షల కోడ్..


