మా ఇంటి ఓట్లు అమ్మబడవు
కాసిపేట: పంచాయతీ ఎన్నికలో నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఓ ఉపాధ్యాయుడి కుటుంబం తమ ఇంటి ముందు అంటించిన పోస్టర్లు ఆలోచింపజేస్తున్నాయి. మండలంలోని ధర్మరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న చొప్పదండి బాబ్జీ. సోమగూడం(కె) గ్రామపంచాయతీలోని తన స్వగృహంలో నివాసం ఉంటున్నాడు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వచ్చే అభ్యర్థులు, నాయకులను ఇబ్బంది పెట్టకుండా, ఎవరూ ఇబ్బంది పడకుండా ముందస్తుగా ‘మా ఇంటి ఓట్లు అమ్మబడవు’ అని పోస్టర్లు అంటించాడు. ఇది స్థానికంగా అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఉపాధ్యాయుడిని అడగగా తాను భావప్రకటన చేశానని కొందరిలోనైనా మార్పు వచ్చి నోటుకు ఓటు అమ్ముకోకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.


