ఐచర్ వాహనంలో మంటలు
ఆదిలాబాద్‌టౌన్: ఐచర్ వాహనంలో మంటలు చెలరేగిన ఘటన జిల్లాకేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా నుంచి ఆదిలా బాద్‌రూరల్ మండలం యాపల్‌గూడకు గడ్డి లోడ్‌తో వెళ్తున్న వాహనం స్థానిక మసూద్‌చౌక్ వద్దకు చేరుకోగానే అక్కడ విద్యుత్ తీగలు తగి లాయి. క్షణాల వ్యవధిలో మంటలు అంటుకో వడంతో డ్రైవర్ ఆసిఫ్ క్షేమంగా బయటపడ్డాడు. స్థానికులు మంటలార్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని మంటలార్పివేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


