రెండు ఆలయాల్లో చోరీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి పునరావాస కాలనీలోని రేణుక ఎల్లమ్మతల్లి, శ్రీమార్కండేయస్వామి ఆలయాల్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆలయాల్లోని రెండు హుండీల నుంచి దాదాపు రూ.10 వేల వరకు నగదు, ఆరు గ్రాముల బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారని ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. స్థానికుడు సింగం శంకర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


