అ‘పూర్వం’ ఆత్మీయం
లక్సెట్టిపేట మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1976–77 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. వీరి ఆత్మీయ సమ్మేళనానికి స్థానిక కేఎస్సార్ ఫంక్షన్ హాల్ వేదికై ంది. సుమారు 48 ఏళ్ల తర్వాత అందరూ ఒకచోట చేరి సందడి చేశారు. ఉద్యోగ, వ్యాపారీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్లు దశాబ్దాల తర్వాత కలుసుకున్నారు. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుని రోజంతా సంతోషంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు లక్ష్మిరాజం, కమల కుమారి, ఎల్లంకి సత్తయ్యలను పూలమాలలతో సత్కరించారు. తమ పాఠశాలకు బీరువాను బహుమతిగా అందజేశారు.
ఇందులో భాగంగా కొందరు 60 ఏళ్లు పూర్తయినందున స్నేహితుల మధ్య షష్టిపూర్తి జరుపుకొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఒజ్జల రవీందర్, విజయమోహన్ రెడ్డి, గుండ వీరేంద్రదాస్, అమరేశ్వర్‌రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. – లక్సెట్టపేట
కాగజ్‌నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2000–01 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈఏడాదితో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జుబ్లీ వేడుకలు జరిపారు. ముందుగా ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆనాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. అనంతరం వైద్యశిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు చికిత్స అందజేశారు. ఉన్నత శాఖలో పని చేస్తున్న పూర్వ విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. – కాగజ్‌నగర్‌టౌన్
జవహర్ నవోదయ విద్యాలయంలో..
అ‘పూర్వం’ ఆత్మీయం


