కారు లారీ ఢీ, ఒకరికి గాయాలు
సారంగపూర్: మండలంలోని ధని–సాయినగర్ గ్రామాల మధ్యలో రైస్‌మిల్లు వద్ద ఆదివారం కారు లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నిర్మల్‌కు చెందిన రమేశ్‌గౌడ్ అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని తిరిగి కారులో వెళ్తున్నాడు. ఇదే సమయంలో ఎదురుగా నిర్మల్ వైపు నుంచి సారంగాపూర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. కారు ముందుభాగం ధ్వంసమైంది. కారు డ్రైవింగ్ చేస్తున్న రమేశ్‌గౌడ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని అంబులెన్స్‌లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. కాగా, లారీడ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
రెండు బాల్యవివాహాల నిలిపివేత
ఆదిలాబాద్‌రూరల్: మావల మండలంలో ఆదివారం రెండు బాల్య వివాహాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా షీటీం ఏఎస్సై సుశీల మాట్లాడుతూ మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలలో ఇటీవల బాల్య వివాహాలపై కలిగే నష్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. పాఠశాల స్నేహితురాలు ఇద్దరూ విద్యార్థినులకు బాల్యవివాహాలు నిశ్చయమయ్యాయని తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వెంటనే షీ టీం బృందం వారి వివరాలు తెలుసుకుని సీడబ్ల్యూసీ సమక్షంలో కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్యవివాహాలను చేయడం నేరమన్నారు. తల్లిదండ్రులు బాల్య వివాహాలను నిలిపివేశారు. షీటీం బృంద సభ్యుల అవగాహన కార్యక్రమాలతో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. షీ టీం బృంద సభ్యులను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. షీ టీం బృందం హెడ్ కానిస్టేబుల్ వాణిశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.
ఉచిత వైద్యం అందించాలి
నస్పూర్: సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పూర్తిస్థాయి అపరిమిత ఉచిత వైద్యం అందించాలని ఐఎన్‌టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. తక్కువ పెన్షన్‌తో పెరుగుతున్న వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పెన్షన్‌ను ప్రతీ మూడేళ్లకోసారి సమీక్షించాలని కోరారు. ర


