ఖోఖో విజేత ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు
ఆదిలాబాద్/మంచిర్యాలఅర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖోఖో బాలుర జట్టు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటింది. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ అండర్–19 ఖోఖో పోటీల విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టుపై 12–24 పాయింట్లతో విజయకేతనం ఎగరేసింది. బాలికల విభాగంలో నల్గొండపై మూడు పాయింట్ల వ్యత్యాసంతో ఆదిలాబాద్ జిల్లా బాలికలు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ పోటీల్లో జిల్లా కేంద్రంలోని టీజీటీడబ్ల్యూఆర్జేసీ కళాశాలకు చెందిన విద్యార్థులు సంపత్ నాయక్, ఆర్.ప్రదీప్, నిఖిల్ రాజ్, రితేష్ నాయక్, శేఖర్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించినట్లు కోచ్ అతుల్, ఉమ్మడి జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు తెలిపారు. వీరిలో రిషిత్ నాయక్, రాథోడ్ ప్రదీప్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. వీరిలో రిషిత్ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై నట్లు వివరించారు. జాతీయస్థాయికి ప్రాతినిధ్యం వహించనున్న ఈ ఇరువురు క్రీడాకారులు ఈనెలాఖరులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ వేదికగా నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆడనున్నట్లు పేర్కొన్నారు.
ఖోఖో విజేత ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు


