చికిత్స పొందాకే డిశ్చార్చి కావాలి
ఆదిలాబాద్‌రూరల్: పూర్తిస్థాయిలో చికిత్స పొందాకే ఆసుపత్రి నుంచి డిశ్చార్చి కావాలని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ అన్నారు. పట్టణంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పాటగూడ గ్రామానికి చెందిన కొలాం తెగకు చెందిన సిడాం సీతబాయి ఈ నెల 4న ప్రసూతి కోసం రిమ్స్‌లో చేరగా 5న మగ శిశువును జన్మనిచ్చింది. రక్తం తక్కువగా ఉందని బాలింత కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వెంటనే స్పందించి ఆదివారం ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న సీతబాయికు మెరుగైన వైద్యం అందించడంతోపాటు అవసరమైన రక్తం ఎక్కించేలా చూడాలని రిమ్స్ డైరెక్టర్‌ను కోరామని తెలిపారు. స్పందించిన ఆయన మెరుగైన వైద్యం అందించేలా చూస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, సంఘం నాయకులు ఉన్నారు.


