21న జాతీయ లోక్ అదాలత్
మంచిర్యాలక్రైం: ఈ నెల 21న జాతీయ లోక్ అదా లత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీర య్య తెలిపారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయస్థానంలో జిల్లా పోలీసు ఉన్నతాధిరులతో సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట న్యాయస్థానాల్లోనూ ప్రత్యేక లోక్ అదా లత్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో మోటార్ వాహన నష్టపరిహారం, ఎన్‌ఐ యాక్ట్, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు పరిష్కరించుకోవచ్చని అన్నారు. వీలైనన్ని ఎక్కువ కేసుల పరిష్కారానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి లాల్‌సింగ్ శ్రీనివాస్‌నాయక్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.నిర్మల, డీసీపీ ఏ.భాస్కర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి రామ్మోహన్‌రెడ్డి, జూ నియర్ సివిల్ జడ్జిలు కవిత, నిరోష, ఎకై ్సజ్ మేజి స్ట్రేట్ కృష్ణతేజ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.


