’లెదర్‌పార్కు స్థలం కబ్జా చేస్తే సహించం’
మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల పక్కన పాలవాగు సమీపంలో ప్రభుత్వం లెదర్ పార్క్ కోసం 25 ఎకరాలు కేటాయించిందని, ఆ స్థలాన్ని ఎవరైనా కబ్జాకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఎస్టేట్‌ఽ అధికారి భిక్షానాయక్ అ న్నారు. శనివారం ఆయన తహసీల్దార్ సతీష్‌కుమార్‌తో కలిసి లెదర్ పార్క్ స్థలాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు. పార్క్ స్థలంలో కొందరు శ్మశానవాటికను అనుకుని మృతదేహాలను పాతి పెడుతున్నారని తహసీల్దార్‌కు తెలియజేయగా.. అలాంటివి జరుగకుండా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. కార్పొరేషన్ మేనేజర్ యాదయ్య, గిర్దావర్ గణపతి, లెదర్ పార్క్ సాధన కమిటీ నాయకులు విజయ్‌కుమార్, వెంకన్న పాల్గొన్నారు.


