యూడైస్ ప్లస్‌లో ఎంఈవోలదే కీలకపాత్ర
మంచిర్యాలఅర్బన్: యూడైస్ ప్లస్‌లో పాఠశాలల సమాచారం నమోదు చేయడం, ధ్రువీకరించడంలో ఎంఈవోలదే కీలకపాత్ర అని డీ ఈవో యాదయ్య అన్నారు. శనివారం జిల్లా సైన్స్ సెంటర్‌లో పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాలు, ఇతర వనరులకు సంబంధించిన వి వరాల సేకరణపై ఎంఈవోలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమోదు చేసిన డేటా కచ్చితత్వాన్ని నిర్ధారించడం, తప్పులు సరిదిద్దడం, డేటా నాణ్యతను మెరుగుపర్చాల్సి ఉంటుందని తె లిపారు. జిల్లా ప్లానింగ్ కో–ఆర్డినేటర్ భవర్ మాట్లాడుతూ యూడైస్ డేటా మార్కుల ఆధారంగా జిల్లా ర్యాంకు, మౌలిక వసతుల సౌకర్యాలు మంజూరవుతాయని తెలిపారు. స్టాటిస్టికల్ కో–ఆర్డినేటర్ రాజ్‌కుమార్, సెక్టోరల్ అధికారులు విజయలక్ష్మి, చౌదరి, డీఎస్‌వో రాజగోపాల్, నగేష్ పాల్గొన్నారు.


