ఓటు హక్కు వినియోగించుకోవాలి
జన్నారం: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కీలకమని, ప్రతి ఒక్కరూ ధైర్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శనివారం మండల కేంద్రంలో పోలీసుస్టేషన్ నుంచి అంగడిబజార్ వరకు ఎస్సై అనూష ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. కవాతులో పాల్గొన్న అనంత రం డీసీపీ మాట్లాడుతూ శాంతియుత వాతా వరణంలో ఎన్నికలు జరగాలనేది తమ ఆ కాంక్ష అన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ఓటు వేసేందుకు యువకులు ముందుకు రావాలని తెలిపారు. గెలిచిన త ర్వాత ర్యాలీలు, డీజేలతో నృత్యాలకు అనుమతి లేదని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు నడుచుకోవాలని, డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురి చేస్తే చర్యలుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీ ఐ రమణమూర్తి, జన్నారం, దండెపల్లి ఎస్సైలు అనూష, తహసీనోద్దీన్ పాల్గొన్నారు.


