రామకృష్ణాపూర్: గతంతో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో మందమర్రి ఏరియా పురోగతి సాధించిందని ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. నవంబర్ మాసంలో ఏరియా ఉద్యోగులందరి సమష్టి కృషితో 68శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్పతిలోనే కాకుండా బొగ్గు రవాణాలోనూ పురోగతి సాధించామని, గతంలో 30 రేకుల వరకే రవాణా జరిగితే, ఈ నవంబర్‌లో 33 రేకుల రవాణా చేశామన్నారు. ఉద్యోగులు, అ ధికారులు, కార్మిక సంఘాల నాయకులు స మష్టిగా సహకరిస్తే అండర్ గ్రౌండ్ గనుల్లో 100శాతం ఉత్పతి లక్ష్యం సాధించవచ్చన్నా రు. రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ ఫేజ్–2 ప్రజాభిప్రాయసేకరణ ఈ నెల 3న ఓసీ కా ర్యాలయ ఆవరణలో ఉంటుందని, అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో ఎస్ ఓటు జీఎం జీఎల్ ప్రసాద్, ఏరియా ఇంజినీర్ బాలాజీ భగవతి, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఐఈడీ కిరణ్‌కుమార్, సీనియర్ పీఓ బొంగోని శంకర్ తదితరులు పాల్గొన్నారు.


