కబడ్డీ బాలికల జిల్లా జట్టు ఎంపిక
శ్రీరాంపూర్: జిల్లా జూనియర్స్ బాలికల కబడ్డీ జట్టును ఎంపిక చేశారు. కొద్ది రోజులుగా నస్పూర్‌లోని సాధన డిఫెన్స్ అకాడమీలో ఎంపిక పోటీలు నిర్వహించగా.. సోమవారం తుది జట్టు ప్రకటించారు. ఈ జట్టు ఈ నెల 2 నుంచి 5వరకు నల్గొండ జిల్లా హాలియ గ్రామంలో జరిగే 51వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటుందని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్, జిల్లా కార్యదర్శి కార్తీక్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. జట్టు కోచ్‌లుగా కే.రవీందర్, శివ, మేనేజర్‌గా సంఘవి వ్యవహరిస్తున్నారు. జట్టుకు ఎంపికై న వారిలో సీహెచ్.రక్షిత(రామకృష్ణాపూర్), యన్.శ్రీజ(మైలారం), ఎం.శృతి(మైలారం), ఎం.వేదనసాయి(ఎల్లారం), ఎస్.వర్షిణి(గుళ్ల సోమారం), టీ.స్రవంతి(మందమర్రి), ఏ.ఆశ్రిత(నెన్నెల), ఎం.స్పందన(కోటపల్లి), డీ.గీత(బోడపల్లి), కే.అవంతిక(పారుపెల్లి), సీహెచ్.హారిక(పార్ధీ), టీ.కల్పన(అర్జునగుట్ట), యన్.అర్చన(కొత్తపల్లి) ఉన్నారు.


