మా దృష్టి రాలేదు
ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు 41కిలోల వరకే తూకం వేయాలని చెబుతున్నాం. 42కిలోలు తీసుకున్నట్లు మా దృష్టి రాలేదు.
– కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
42కిలోలు పెడుతున్నారు
6ఎకరాల్లో దిగుబడి వచ్చిన 130క్వింటాళ్ల వడ్లను కేంద్రంలో వారం రోజులపాటు ఆరబోసాను. హమాలీలు రాకపోవడంతో కొంత ఆలస్యమైంది. ధాన్యంలో తేమ లేకున్నా బస్తా 42 కిలోలు తూకం వేశారు. ఇదేంటని అడిగితే తరుగు కోసం అంటున్నారు.
– బుచ్చన్న, రైతు, గ్రామం:
కొత్తమామిడిపల్లి, మం: దండేపల్లి


