రెండో రోజు జోరుగా నామినేషన్లు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో రోజు సోమవారం జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా.. సోమవారం ఏకాదశి కావడంతో భారీగా వచ్చాయి. బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌లోని ఏడు మండలాల్లో రెండ్రోజులు కలిపి 114 సర్పంచ్ స్థానాలకు గాను 301, 996 వార్డు సభ్యుల స్థానాలకు 739 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో 1,39,312 మంది ఓటర్లు ఉండగా 69,249 మంది పురుషులు, 70,055 మంది మహిళలు, ఇతరులు 8 మంది ఉన్నారు.
అభ్యర్థుల బారులు
భీమిని: సోమవారం మంచి రోజు కావడంతో మండల కేంద్రం భీమినిలోని మండల విద్యావనరుల కేంద్రం లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి భారీగా తరలివచ్చారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు బారులు తీరి నామినేషన్లు వేశారు. మద్దతు దారులలతో తరలిరావడంతో సందడి నెలకొంది.
నామినేషన్ల వివరాలు
మండలం పంచా సర్పంచ్ వార్డులు వార్డు సభ్యుల
యతీలు నామినేషన్లు నామినేషన్లు
బెల్లంపల్లి 17 57 156 140
భీమిని 12 32 100 075
కన్నెపల్లి 15 36 130 088
కాసీపేట 22 35 190 075
నెన్నెల 19 53 158 134
తాండూరు 15 53 144 152
వేమనపల్లి 14 35 118 075
మొత్తం 114 301 996 739
భీమినిలో బారులు తీరిన అభ్యర్థులు


