హెచ్‌ఐవీపై అవగాహన ఉండాలి
మంచిర్యాలటౌన్: ప్రజలందరూ హెచ్‌ఐవీ(ఎయిడ్స్)పై అవగాహన కలిగి ఉండాలని, ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా హెచ్‌ఐవీ ఎయిడ్స్ సమీకృత వ్యూహ సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విద్యార్థులతో అవగాహన ర్యాలీని సోమవారం డీఎంహెచ్‌వో ప్రారంభించారు. ఎయిడ్స్ దినోత్స వం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారి అనిత మాట్లాడుతూ 2010–2025 మధ్య హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కేసులు దేశంలో గణనీయంగా తగ్గాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్, లెప్రసి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధాకర్‌నాయక్, ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్, ఆర్‌ఎంవోలు డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీమన్నారాయణ, దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు.
ఉత్తమ సేవలకు అవార్డులు
హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో కృషి చేసిన ఉద్యోగులకు ఉత్తమ అవార్డులను డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో కాసిపేట వైద్యాధికారి డాక్టర్ శ్రీదివ్య, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, దీపక్‌నగర్ సీవో సురేఖ, ఐసీటీసీ సిబ్బంది శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్, రాజేందర్ ఉన్నారు.


