ధాన్యం ఆరబెట్టి తీసుకు రావాలి
వేమనపల్లి/కోటపల్లి: తేమ శాతం తగ్గే వరకు వరి ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. సోమవారం ఆయన వేమనపల్లి, కోటపల్లి మండల కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యమని ధ్రువీకరించిన తర్వాతే కొనుగోలు చేయాలని, అప్పుడే వరి ధాన్యం లోడ్‌తో వెళ్లిన లారీలకు మిల్లుల వద్ద కోతలు, అభ్యంతరాలు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో కిషన్, డీపీఎం సారయ్య, ఏపీఎంలు పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన
వేమనపల్లి మండలం నీల్వాయి, వేమనపల్లి నామినేషన్ క్లస్టర్‌లను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ వివరాలు తెలుసుకున్నారు. ఎంపీడీవో కుమారస్వామి ఆర్‌ఐ ఖాలిక్ పాల్గొన్నారు.
దుప్పట్లు పంపిణీ
మంచిర్యాలఅర్బన్: స్థానిక ఎస్సీ కళాశాల బాలుర వసతిగృహంలో సోమవారం రాత్రి విద్యార్థులకు జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య దుప్పుట్లు పంపిణీ చేశారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు దుర్గాప్రసాద్, ఏఎస్‌డబ్ల్యూవో ధర్మనంద్‌గౌడ్, ప్రశాంత్, హెచ్‌డబ్ల్యూవో కుమారస్వామి పాల్గొన్నారు.


